Officer: ఆత్మహత్యే శరణ్యమంటున్న 'ఆఫీసర్' ఏపీ డిస్ట్రిబ్యూటర్!

  • ఏపీ హక్కులు పొందిన సుబ్రహ్మణ్యం
  • సినిమాకు తొలి షో నుంచే ఫ్లాప్ టాక్
  • కలెక్షన్లు లేక భారీగా నష్టపోయిన సుబ్రహ్మణ్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 'ఆఫీసర్' సినిమా రైట్స్ కొనుగోలు చేసిన సుబ్రహ్మణ్యం అనే డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు తనకు ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నాడు. 'ఇండియా టుడే'తో మాట్లాడిన ఆయన, ఆఫీసర్ షూటింగ్ సమయంలో తన వద్ద నుంచి వర్మ రూ. 1.30 కోట్ల ఫైనాన్స్ తీసుకున్నాడని చెప్పారు. ఆపై సినిమా పూర్తి అయినా, ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదని, తాను అడిగితే, కోర్టుకు వెళ్లాలని వర్మ బెదిరించారని ఆరోపించారు. కోర్టుకు వెళితే, సమస్య తేలేందుకు సమయం పడుతుందన్న ఉద్దేశంతో, సినిమా గోదావరి రైట్స్ ఇవ్వాలని అడిగానని, కేవలం గోదావరి రైట్స్ మాత్రమే విడిగా ఇచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసిన వర్మ, ఏపీ రైట్స్ మొత్తం తీసుకోవాలని చెప్పాడని అన్నారు.

గత్యంతరం లేని పరిస్థితుల్లో తాను మరో రూ. 3.50 కోట్లు చెల్లించి ఏపీలో సినిమాను విడుదల చేశానని, తొలి షో నుంచే మినిమమ్ కలెక్షన్లు కూడా రాలేదని విలపించాడు. లాభాలు వస్తాయని భావించిన చిత్రం భారీ నష్టాలను మిగిల్చిందని, ఆత్మహత్యే శరణ్యమని చెప్పారు. సుబ్రహ్మణ్యంకు జరిగిన నష్టానికి నాగార్జున, వర్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More Telugu News