Chandrababu: ఆదుకునే అన్నగా, అన్నీ తానై చూసే కొడుకుగా... ప్రజలతో మమేకమైన చంద్రన్న చిత్రాలు!

  • విజయనగరం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు
  • రైతులకు ఆధునిక టెక్నాలజీతో కూడిన పనిముట్లు
  • అన్ని వర్గాల ప్రజలకూ అండగా ఉంటానని హామీ

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని, తాను మాత్రం ప్రజలకు అండగా నిలుస్తానని సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా ఎస్ కోట మండలంలో పర్యటించిన ఆయన, ప్రజలతో మమేకమై, వారిలో ఒకరిగా తిరుగుతూ, వారి కష్ట సుఖాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అండ కావాల్సిన కుటుంబానికి తాను ఓ అన్నలా ఉంటానని, బిడ్డలొదిలేసిన తల్లిదండ్రులకు కుమారుడిని అవుతానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రైతులు మరింత దిగుబడిని అందుకునేలా టెక్నాలజీ సాయంతో పనిచేసే ఆధునిక పనిముట్లను అందుబాటులోకి రప్పించి, ఖర్చులు తగ్గేలా చూస్తానని చెప్పారు. బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకోకున్నా, రైతులకు రుణ మాఫీ చేశానని గుర్తు చేశారు.

చదువుకుని కూడా ఉద్యోగం లేని వారికి భృతి ఇవ్వాలని నిర్ణయించామని, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చూస్తానని చెప్పారు. జిల్లాలోని కీలకమైన జంఝావతి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని, ఆపై లక్ష ఎకరాలకు సాగునీరందుతుందని అన్నారు. డ్వాక్రా సంఘాల్లోని వారికి ఒక్కొక్కరికీ రూ. 10 వేలను ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. చంద్రబాబు పర్యటన చిత్రాలను మీరూ చూడవచ్చు.

More Telugu News