Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • గెస్ట్ పాత్ర చేస్తున్నానన్న కీర్తి సురేశ్ 
  • 'అరవింద సమేతకు' భారీ షెడ్యూల్ 
  • తమ్ముడి సినిమాలో అన్న గెస్ట్! 
  • పూర్తి కావచ్చిన 'శ్రీనివాసకల్యాణం'

*  శివకార్తికేయన్, సమంత జంటగా రూపొందుతున్న 'సీమరాజా' చిత్రంలో తాను గెస్ట్ పాత్రను పోషిస్తున్నట్టు వస్తున్న వార్తలను కథానాయిక కీర్తి సురేశ్ ధ్రువీకరించింది. ఈ సినిమాలో భాగమైనందుకు హ్యాపీగా వుందని, ఇది తనకు మరింత గుర్తింపును తెస్తుందని చెప్పింది.
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న 'అరవింద సమేత' చిత్రం తాజా షెడ్యూలు నిన్న హైదరాబాదులో మొదలైంది. నెల రోజుల పాటు బ్రేక్ అన్నది లేకుండా నిర్విరామంగా షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
*  తమిళ హీరో కార్తీ నటిస్తున్న 'కడైకుట్టి సింగం' చిత్రాన్ని తెలుగులో 'చినబాబు' పేరిట అనువదిస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తీ అన్న సూర్య గెస్ట్ పాత్రలో కనిపిస్తాడట.
*  నితిన్, రాశిఖన్నా జంటగా రూపొందుతున్న 'శ్రీనివాస కల్యాణం' చిత్రం షూటింగ్ అమలాపురం పరిసరాల్లో జరుగుతోంది. త్వరలోనే ఈ షూటింగ్ పూర్తవుతుందని, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలెడతారని సమాచారం. దీనికి సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు.

More Telugu News