sensex: వరుసగా రెండో రోజు పతనమైన మార్కెట్లు.. భారీగా నష్టపోయిన సెన్సెక్స్

  • ఆర్బీఐ మానిటరీ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తం
  • 215 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 16.94 శాతం నష్టపోయిన పీసీ జువెలర్స్

భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ నేపథ్యంలో, ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 215 పాయింట్లు నష్టపోయి 35,012కి పడిపోయింది. నిఫ్టీ 68 పాయింట్లు కోల్పోయి 10,629కి పతనమైంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
గేట్ వే డిస్ట్రిపార్క్స్ (5.30%), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (4.65%), సన్ టీవీ (4.35%), సద్భావ్ ఇంజినీరింగ్ (4.04%), రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ (3.49%).    

టాప్ లూజర్స్:
పీసీ జువెలర్స్ (-16.94%), ఇంటెలెక్ట్ డిజైన్ ఎరీనా లిమిటెడ్ (-11.09%), క్వాలిటీ (-9.79), ప్రజ్ ఇండస్ట్రీస్ (-8.14%), ఏజీస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ (-7.42%).  

More Telugu News