vijay devarakonda: విజయ్ దేవరకొండ ఆ రోజున కూడా రావడం లేదట!

  • 'టాక్సీవాలా'గా విజయ్ దేవరకొండ 
  • దర్శకుడిగా రాహుల్ సాంకృత్యన్ 
  • నాయికలుగా ప్రియాంక ... మాళవిక నాయర్

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'టాక్సీవాలా' చిత్రం రూపొందింది. ఒక టాక్సీవాలాకు .. ఒక ఆత్మకు మధ్య జరిగే ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా కొనసాగుతుంది. ఈ సినిమాను మే 14వ తేదీన విడుదల చేయాలనుకుంటున్నట్టు ఆ మధ్య దర్శక నిర్మాతలు చెప్పారు. ఆ తరువాత కొన్ని రోజులకి .. ఈ సినిమాను జూన్ 14వ తేదీన థియేటర్లకు తీసుకువస్తున్నట్టుగా విజయ్ దేవరకొండ  ట్వీట్ చేశాడు.

అయితే ఇప్పుడు ఆ రోజున కూడా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం లేదనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు విజయ్ దేవరకొండ క్రేజ్ కి తగినట్టుగా లేవనీ, ఆ సన్నివేశాలను రీ షూట్ చేస్తే బాగుంటుందని టీమ్ భావించిందట. ప్రస్తుతం వాళ్లు ఆ పనిలోనే వున్నారని అంటున్నారు. ఈ కారణంగానే ఈ సినిమాను జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన కథానాయికలుగా ప్రియాంక జవాల్కర్ .. మాళవిక నాయర్ కనిపించనున్నారు.   

More Telugu News