airtel: యూజర్ల మెప్పు కోసం ఎయిర్ టెల్ తాయిలాలు... అదనపు డేటా, వ్యాలిడిటీ

  • రూ.399 ప్లాన్ లో ఉచిత డేటా, వ్యాలిడిటీ పెంపు
  • రోజూ 1.4 జీబీకి బుదులు రూ.2.4జీబీ డేటా
  • వ్యాలిడిటీ 70 రోజుల నుంచి 84 రోజులకు పెంపు

తన యూజర్లు ప్రత్యర్థి జియో కంపెనీకి జంప్ అయి పోకుండా చూసుకునేందుకు భారతీ ఎయిర్ టెల్ నానా తంటాలు పడుతోంది. తాజాగా రూ.399 ప్లాన్ లో యూజర్లకు అదనపు తాయిలాలు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులు కాగా, ప్రతి రోజూ 1.4జీబీ డేటా ఉచితం. అయితే ఎంపిక చేసిన కస్టమర్లకు ఏకంగా ప్రతి రోజూ 2.4 జీబీ 4జీ డేటాను ఉచితంగా అందించడమే కాకుండా 84రోజుల వ్యాలిడిటీని ఆఫర్ చేయడం విశేషం. ఇక అపరిమిత కాల్స్, ప్రతి రోజూ 100 వరకు ఉచితంగా ఎస్ఎంఎస్ లు కూడా యూజర్లు పొందొచ్చు. రిలయన్స్ జియో రూ.399 ప్లాన్ లో ప్రతి రోజూ అందిస్తున్న ఉచిత డేటా 1.5జీబీ మాత్రమే. దీనికి పోటీగా ఎయిర్ టెల్ తన ప్లాన్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.

More Telugu News