stock market: తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న మార్కెట్లు

  • ఉదయం 200 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • క్రమంగా నష్టాల్లోకి జారుకున్న సూచీలు
  • ఆర్బీఐ విధాన పరపతి సమీక్ష నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత

అంతర్జాతీయంగా సానుకూలతలు ఉన్న నేపథ్యంలో ఈ ఉదయం భారీ లాభాలతో ట్రేడింగ్ ను ఆరంభించిన స్టాక్ మార్కెట్లు... ఆ లాభాలను ఎంతోసేపు నిలుపుకోలేకపోయాయి. ఆర్బీఐ విధాన పరపతి సమీక్షపై దృష్టి పెట్టిన ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉదయం 200 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్ ప్రస్తుతం నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 8 పాయింట్ల నష్టంతో 35,219కి సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 10,686 వద్ద కొనసాగుతోంది.

దీలీప్ బిల్డ్ కాన్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్, సన్ టీవీ, లిండే ఇండియా, వీఐపీ ఇండస్ట్రీస్ తదితర సంస్థల షేర్లు లాభాల్లో ఉన్నాయి. పీసీ జువెలర్స్, రతన్ ఇండియా పవర్, ప్రజ్ ఇండస్ట్రీస్, క్వాలిటీ, ఇంటలెక్స్ట్ డిజైన్ తదితర కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

More Telugu News