వైసీపీలో చేరబోయిన మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు... అడ్డుకునేందుకు మరో వర్గం దాడి!

04-06-2018 Mon 09:07
  • గతంలో ఆదితో పాటు కలసి టీడీపీలో చేరిన స్థానిక నేతలు
  • తిరిగి వైసీపీలోకి వెళ్లే ప్రయత్నం
  • ఘర్షణల నేపథ్యంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు

వైఎస్ఆర్ కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచి, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరుల్లోని ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించగా, మరో వర్గం వారు దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కడప జిల్లా పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన ముగ్గురు స్థానిక నేతలు గతంలో ఆదినారాయణరెడ్డితో కలసి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు.

ఆపై ఇప్పుడు వారు తిరిగి వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న ఆదినారాయణరెడ్డి వర్గం వారిపై దాడికి దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, హుటాహుటిన అక్కడికి చేరుకుని, రెండు వర్గాలనూ చెదరగొట్టారు. ఈ ఘటన తరువాత పెద్దదండ్లూరు, సుగమంచిపల్లె గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొని వుండగా, రెండు గ్రామాల్లోనూ పోలీసులు ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు.