ముంబయ్ లో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌!

03-06-2018 Sun 17:38
  • ముంబయిలో రేపు విందు
  • బహిష్కరించిన ముస్లిం సంఘాలు
  • ఇతర మతాలను గౌరవిస్తామంటోన్న ఆర్‌ఎస్‌ఎస్‌

రంజాన్‌ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ రేపు ముంబయ్ లో ఇఫ్తార్‌ విందు ఇవ్వనుంది. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా నడిచే రాష్ట్రీయ ముస్లిం మంచ్ ఆధ్వర్యంలో ఈ విందు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, దీనిపై స్పందించిన ముస్లిం సంఘాల నాయకులు.. ఆర్‌ఎస్‌ఎస్‌ కపట నాటకాలు ఆడుతోందని అన్నారు. ఓవైపు ముస్లిం వ్యతిరేక ప్రచారానికి పాల్పడి, మరోవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ విందుకు ముస్లింలు హాజరుకావద్దని వారు పిలుపునిచ్చారు.

కాగా, ఆర్‌ఎస్‌ఎస్‌ ఇస్తోన్న ఇఫ్తార్‌ విందు ముంబయ్ లోని సహ్యాద్రి గెస్ట్‌ హౌస్‌లో జరగనుంది. ఈ విందుకు సుమారు 30 దేశాల నుంచి 200 మంది ముస్లిం ప్రముఖులను ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానించింది. ఎమ్‌ఆర్‌ఎమ్‌ జాతీయ కన్వీనర్‌ విరాగ్‌ పాచ్‌పోర్‌ తాము ఇవ్వనున్న ఇఫ్తార్‌పై మాట్లాడుతూ.. ఆరెస్సెస్‌ పట్ల మైనారీటీలకు ఉన్న దురభిప్రాయాలను తొలగించడానికే ఈ విందు ఇస్తున్నామని, తమ సంఘ్ ఇతర మతాలను గౌరవిస్తుందని, భారత్‌లో శాంతి కోసం కృషి చేస్తుందిని అన్నారు.