farmers: రైతుల ఆందోళనలను చులకన చేసి మాట్లాడిన కేంద్ర వ్యవసాయ మంత్రి

  • కోట్లాది మంది రైతులుంటే నిరసన చేస్తున్నది కొద్ది మందే
  • సందర్భోచితం కాదన్న కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్
  • పంటలకు మద్దతు ధర, రుణాల మాఫీ డిమాండ్లు

రైతుల ఆందోళనలను కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాధామోహన్ సింగ్ చిన్న విషయంగా తీసిపారేశారు. పలు రాష్ట్రాల్లోని రైతుల పది రోజుల పాటు నిరసన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. మీడియా దృష్టిలో పడేందుకే కొందరు రైతులు నిరసన కార్యకమ్రాలు చేస్తున్నట్టు మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘దేశంలో కోట్లాది మంది రైతులు ఉన్నారు. కానీ, కేవలం కొందరే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఎంత మాత్రం సందర్భోచితం కాదు’’ అన్నారు.

రైతులు శుక్రవారం నుంచి పది రోజుల నిరసన కార్యక్రమాన్నిచేపట్టిన విషయం తెలిసిందే. బిహార్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రలోని పలు రైతు గ్రూపులు ఇందులో పాలు పంచుకుంటున్నాయి. పంటలకు సరైన మద్దతు ధర, రుణాల మాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, వీటిని మాత్రం పాలకులు తేలిగ్గా తీసుకుంటున్నారనడానికి వారి తాజా వ్యాఖ్యలే నిదర్శనం. మరోపక్క అసలు రైతులకు ఎటువంటి సమస్యలూ లేవని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News