gold: వరుసగా మూడవ రోజు తగ్గిన బంగారం ధర

  • మరో రూ.300 తగ్గిన బంగారం ధర
  • 10 గ్రా.ధర రూ.31,600గా నమోదు
  • కిలో వెండి ధర మరో రూ.100 తగ్గి 40,500కు చేరిక

బంగారం ధరలు వరుసగా మూడవ రోజు తగ్గాయి. ఈరోజు 10 గ్రాముల బంగారం ధర మరో రూ.300 తగ్గి రూ.31,600గా నమోదైంది. అంతర్జాతీయంగా బలహీన పరిస్థితులు, స్థానిక బంగారం దుకాణదారుల నుంచి డిమాండ్‌ లేమితో పసిడి ధరలు దిగివస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

మరోవైపు, వెండి ధరలు కూడా కింది చూపులు చూశాయి. మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి ధర మరో 100 రూపాయలు తగ్గి 40,500కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో వెండి ధరలు తగ్గాయి. గ్లోబల్‌ మార్కెట్‌లో 0.37 శాతం పడిపోయిన బంగారం ధర ఔన్సుకు 1293 అమెరికన్ డాలర్లుగా ఉంది.        

More Telugu News