Haryana: రైతులకి ఎటువంటి సమస్యలూ లేవు: అన్నదాతల పోరాటంపై హర్యానా సీఎం

  • అనవసర విషయాలపై దృష్టి పెడుతున్నారు
  • వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించకపోతే రైతులకే నష్టం
  • ఖట్టర్‌ వ్యాఖ్యలపై విమర్శలు

దేశ ప్రజలకు అన్నం పెడుతోన్న రైతన్నలపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'వారికి ఎటువంటి సమస్యలు లేవు.. అనవసర విషయాలపై దృష్టి పెడుతున్నారు.. వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించకపోతే రైతులకే నష్టం' అని ఓ జాతీయ మీడియాతో అన్నారు.

కాగా ఉత్తరప్రదేశ్‌, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు నిన్న పది రోజుల ఆందోళనను ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో రైతులు రోడ్లపై కూరగాయలు, పాలు పారబోసి నిరసన తెలిపారు. ఈనెల 10న భారత్ బంద్ నిర్వహించాలని యోచిస్తున్నారు. వారికి మరింత ఆగ్రహం తెప్పించేలా ఖట్టర్‌ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి.         

More Telugu News