Pawan Kalyan: సందేహం వద్దు... పవన్ ఏం చెప్పినా సరే... చేసేయడమే!: సాయి ధరమ్ తేజ్

  • రాజమహేంద్రవరం వచ్చిన సాయి ధరమ్ తేజ్
  • పవన్ ఆర్డరేస్తే ఎన్నికల ప్రచారం
  • 29న విడుదల కానున్న తేజ్ కొత్త చిత్రం

తన మావయ్య పవన్‌ కల్యాణ్‌ ఏం చెబితే అది చేసేందుకు తాను సిద్ధమని, అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదని మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ అన్నాడు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు హీరోయిన్‌ కేథరిన్‌ తో కలిసి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడాడు. పవన్‌ మాట తనకు ఓ ఆదేశం వంటిదని, ఆయన ఆర్డరేస్తే జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రెడీగా ఉన్నానని చెప్పారు. తాను నటించిన 'తేజ్‌.. ఐ లవ్‌ యు' చిత్రం బాగా వచ్చిందని, ఈ నెల 29న విడుదలవుతుందని చెప్పాడు. మరో చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోందన్నాడు.

More Telugu News