Andhra Pradesh: హైకోర్టులో కేవియట్ దాఖలు చేసిన టీటీడీ ప్రధాన అర్చకుడు గోవిందరాజ దీక్షితులు

  • గోవిందరాజులును ప్రధాన అర్చకునిగా నియమించిన ప్రభుత్వం
  • తనను అడ్డుకోవాలని చూస్తున్నారంటూ కోర్టుకు
  • తన వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధాన అర్చకుడు ఎం.గోవిందరాజ దీక్షితులు హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. తనను నియమించడాన్ని సవాలు చేస్తూ అర్చకుడు నరసింహ దీక్షితులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని, అదే జరిగితే తన వాదనలు వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వరాదని కోర్టును కోరారు. గత నెల 17న ప్రభుత్వం తనను ప్రధాన అర్చకునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. నరసింహ దీక్షితుల వయసు 74 ఏళ్లు అని, నిబంధనల ప్రకారం ఆయన ఇప్పటికే పదవీ విరమణ చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు.  

టీటీడీ అర్చకులకు 65 ఏళ్ల నిబంధనను తీసుకురావడంతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను ప్రభుత్వం ఆ పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో గోవిందరాజులును నియమించింది. రమణ దీక్షితులను తొలగించడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

More Telugu News