charan: చరణ్ మూవీ టైటిల్ గా 'జగదేకవీరుడు'?

  • బోయపాటి దర్శకత్వంలో చరణ్ 
  • కథానాయికగా కైరా అద్వాని 
  • మూడవ షెడ్యూల్ కి సన్నాహాలు

బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మూడవ షెడ్యూల్ కి సన్నాహాలు చేసుకుంటున్నారు. కైరా అద్వాని కథానాయికగా చేస్తోన్న ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను నిర్ణయించలేదు.

ఆ మధ్య 'రాజవంశస్థుడు' అనే టైటిల్ ను బోయపాటి పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ టైటిల్ పట్ల మెగా అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేయడంతో బోయపాటి మనసు మార్చుకున్నాడు. కథ ప్రకారం చూసుకుంటే 'జగదేకవీరుడు' టైటిల్ కూడా సెట్ అవుతుందనీ .. ఒకసారి పరిశీలించమని చిరూకి .. చరణ్ కి చెప్పాడట. ఈ టైటిల్ కారణంగా ప్రాజెక్టుపై మరింత క్రేజ్ పెరుగుతుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడని సమాచారం. ఇక అటువైపు నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో చూడాలి.   

More Telugu News