స్టార్ డమ్ ను రజనీ పూర్తిగా పక్కన పెట్టేస్తారు: హ్యూమా ఖురేషి

01-06-2018 Fri 12:34
  • రజనీతో నటించడానికి భయపడ్డాను 
  • ఆయన సింప్లిసిటీ చూసి ఆశ్చర్యపోయాను 
  • ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను
రజనీకాంత్ కథానాయకుడిగా పా రంజిత్ దర్శకత్వంలో 'కాలా' సినిమా రూపొందింది. మాఫియా డాన్ గా రజనీకాంత్ నటించిన ఈ సినిమాలో ఆయన భార్యగా ఈశ్వరీరావు .. ప్రియురాలిగా హ్యూమా ఖురేషి నటించింది. జూన్ 7వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి హ్యూమా ఖురేషి మాట్లాడింది."ఈ సినిమాలో నా పాత్ర పేరు 'జరీనా' .. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. రజనీతో కలిసి నటించడానికి ముందు చాలా భయపడ్డాను .. ఆయన సింప్లిసిటీ చూసి చాలా ఆశ్చర్యపోయాను. కొత్తవారితో రజనీ వెంటనే కలిసిపోతూ .. వాళ్లలో భయాన్ని పోగొడతారు. తన స్టార్ డమ్ ను పూర్తిగా పక్కనపెట్టేసి అందరితో చాలా కలివిడిగా ఉంటారు. అదే సమయంలో చాలా క్రమశిక్షణతోను నడచుకుంటారు. రజనీతో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను .. ఆయన నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను" అని చెప్పుకొచ్చింది.