nagarjuna: మల్టీ స్టారర్ కోసం నాగ్ .. నానీల పాట

  • శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీ స్టారర్
  • నాగ్ సరసన ఆకాంక్ష సింగ్ 
  • నాని జోడీగా రష్మిక మందన    

నాగార్జున .. నాని కాంబినేషన్లో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఒక మల్టీ స్టారర్ ను రూపొందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. నాగ్ .. నాని ఇద్దరిపై ఈ పాటను షూట్ చేస్తున్నారు.

కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్ పర్యవేక్షణలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. కథలో కీలకమైన సందర్భంలో ఈ పాట వస్తుందనీ .. సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో డాన్ గా నాగార్జున .. డాక్టర్ గా నాని కనిపించనున్నారు. నాగార్జున సరసన కథానాయికగా ఆకాంక్ష సింగ్ .. నాని జోడీగా రష్మిక మందన కనిపించనున్నారు. విభిన్నమైన కంటెంట్ తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం ఇటు నాగ్ అభిమానులు .. అటు నాని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.         

More Telugu News