Mahesh Babu: గడ్డంతో కనబడుతోన్న మహేశ్‌ బాబు

  • సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసిన నమ్రత
  • కూతురు సితారతో మాట్లాడుతోన్న మహేశ్‌
  • తదుపరి సినిమాలో గడ్డంతో సూపర్‌స్టార్‌?

గడ్డంతో ఉన్న సినీనటుడు మహేశ్‌ బాబు ఫొటోను ఆయన భార్య నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఈ ఫొటోలో మహేశ్‌ ముఖం సరిగ్గా కనపడడం లేదు. తన కూతురు సితారతో మాట్లాడుతూ ఉండగా ఆయన వెనకనుండి ఈ ఫొటోను తీశారు. మహేశ్‌ ముఖం కుడివైపు భాగం మాత్రం కొంచం కనబడుతోంది. ప్రస్తుతం స్పెయిన్‌లో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతోన్న మహేశ్.. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఓ సినిమాకి రెడీ అవుతోన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న తన 25వ సినిమా కోసం సరికొత్త లుక్‌ను ఆయన ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన గడ్డం మీసాలతో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా నమ్రత పోస్ట్ చేసిన ఈ ఫొటో ఆ వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది.    

More Telugu News