krishna: బయోపిక్ గురించి అడిగిన సుధీర్ బాబు .. స్పందించిన కృష్ణ

  • సూపర్ స్టార్ కృష్ణగారి జన్మదినం  
  • శుభాకాంక్షలు తెలిపిన 'సమ్మోహనం' టీమ్
  • అభినందించిన కృష్ణ   

తెలుగు తెరకి సంబంధించినంత వరకూ ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తరువాత స్థానంలో కృష్ణ కనిపిస్తారు. ఒక వైపున హీరోగానూ .. మరో వైపున నిర్మాతగాను ఆయన ప్రయోగాలు .. సాహసాలు చేశారు. తెలుగు సినిమాకి భారీతనం తెచ్చిన నిర్మాతలలో ముందుగా కృష్ణ పేరు కనిపిస్తుంది. ఈ రోజు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా 'సమ్మోహనం' సినిమా టీమ్ కృష్ణని కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేసింది.'సమ్మోహనం' అనే టైటిల్ పెట్టడం పట్ల ఆయన ఈ సినిమా టీమ్ ను అభినందించారు. 'సమ్మోహనం' రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుసుకున్న ఆయన, తన సినిమాల్లో 'పండంటి కాపురం'లో రొమాంటిక్ అంశాలు ఎక్కువగా కనిపిస్తాయని అన్నారు. ఆ సినిమా 37 సెంటర్లలో 100 రోజులు ఆడిన విషయాన్ని గుర్తు చేశారు. కొత్తగా బయోపిక్ ల సందడి పెరుగుతోన్న విషయాన్ని ప్రస్తావించిన సుధీర్ బాబు, కృష్ణగారి బయోపిక్ లో హీరోగా ఎవరు చేస్తే బాగుంటుంది? ఎవరు దర్శకత్వం వహిస్తే బాగుంటుంది? అని అడిగారు. ఎప్పుడో తీయబోయే సినిమా గురించి ఇప్పుడే ఎలా చెప్పగలను? అంటూ కృష్ణ నవ్వేశారు.  

More Telugu News