gold: పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర

  • రూ.230 పెరిగిన 10 గ్రాముల పసిడి ధర
  • రూ.32,090గా నమోదు
  • రూ.200 పడిపోయిన వెండి ధర
  • కిలో వెండి ధర రూ. 40,700కి చేరిక

బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక బంగారం దుకాణదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో ఈ రోజు 10 గ్రాముల పసిడి ధర రూ.230 పెరిగి, 32,090గా నమోదయింది. ఇక గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర 0.09 శాతం పెరిగి ఔన్సు 1,298.40 డాలర్లుగా నమోదయింది. మరోవైపు వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో కిలో వెండి ధర రూ.200 పడిపోయి, రూ. 40,700కి చేరింది. కాగా, వరసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే.                  

More Telugu News