whatsapp: పూర్తిస్థాయిలో 'వాట్సాప్‌ పేమెంట్‌' సేవలు ప్రారంభం.. మూడు బ్యాంకులతో ఒప్పందం!

  • అందుబాటులోకి రానున్న 'వాట్సాప్‌ పేమెంట్‌' సేవలు
  • హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌లతో ఒప్పందం
  • త్వరలోనే ఎస్‌బీఐ కూడా ఈ జాబితాలోకి

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇండియాలోని తన వినియోగదారులందరికి వచ్చేవారంలో పేమెంట్‌ సేవలను అందివ్వనున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. లావాదేవీల ప్రక్రియ కోసం ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌లతో 'వాట్సాప్' ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే ఎస్‌బీఐ కూడా ఈ జాబితాలోకి చేరబోతోంది. మొదటి దశలో కొంత మంది వినియోగదారులతో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పేమెంట్‌ సేవలు విజయవంతం కావడంతో ఇపుడు పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి ఫేస్‌బుక్‌ సన్నాహాలు చేస్తోంది. కాగా భారత్ లో 200 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు.

More Telugu News