petrol: హమ్మయ్య! 16 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు.. ఊపిరి పీల్చుకున్న వాహనదారులు!

  • 16 రోజుల ధరల పెరుగుదలకు ఎట్టకేలకు కళ్లెం
  • స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
  • పెదవి విరుస్తున్న వాహనదారులు

16 రోజులపాటు వాహనదారులను బెంబేలెత్తించిన పెట్రోలు ధరలకు బుధవారం కళ్లెం పడింది.  దేశ వ్యాప్తంగా స్వల్పంగా ధరలు తగ్గడంతో వాహనదారులకు ఊరట లభించినట్టు అయింది. ఢిల్లీలో లీటరు పెట్రోలుకు 60 పైసలు, ముంబైలో 59 పైసలు, ఢిల్లీలో డీజిల్‌పై 56 పైసలు, ముంబైలో 59 పైసలు తగ్గింది. తగ్గిన ధరల ప్రకారం.. ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.77.83, ముంబైలో రూ.85.65, కోల్‌కతాలో రూ.80.47, చెన్నైలో రూ.80.80కి దిగొచ్చింది.

ఇక ఢిల్లీలో బుధవారం లీటర్ డీజిల్ ధర రూ.68.75గా ఉండగా, ముంబైలో రూ.73.20, కోల్‌కతాలో రూ.71.30, చెన్నైలో రూ.72.58గా ఉంది. గత 16 రోజులుగా అంతూపొంతూ లేకుండా పెరిగిన పెట్రోలు ధరలు శుక్రవారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి.  పెట్రో ధరలు పైసల్లో తగ్గడంపై వాహనదారులు పెదవి విరుస్తున్నారు. రూపాయల్లో పెంచి, పైసల్లో తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News