Chandrababu: వెంకన్నను కూడా కేంద్రమే తీసుకుంటుందా?: చంద్రబాబు

  • పురావస్తు శాఖ నుంచి ఎందుకు నోటీసులిచ్చారు? 
  • మళ్లీ ఎందుకు వెనక్కి తీసుకున్నారు? 
  • టీటీడీ పవిత్రతకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారు
  • బీజేపీతో పాటు దానికి సహకరించేవారికి ఓట్లు వేయొద్దు

వెంకన్నను కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఇటీవల తిరుమలలోని ఆలయాలను రక్షిత కట్టడాల పరిధిలో చేర్చేందుకు కేంద్రం పావులు కదుపుతోందని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. విజయవాడలోని మహానాడులో ముగింపు ఉపన్యాసం ఇస్తూ ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు... పురావస్తు శాఖ నుంచి ఎందుకు నోటీసులిచ్చారు? మళ్లీ ఎందుకు వెనక్కి తీసుకున్నారు? అని నిలదీశారు. టీటీడీ పవిత్రతకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, దేశంలో ఏటీఎంలు పనిచేయడం లేదని, బ్యాంకుల్లో డబ్బులు లభించడం లేదని, అలాగే బ్యాంకుల్లో స్కాములు పెరిగిపోయాయని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేలా కర్ణాటకలో బీజేపీ వ్యవహరించిందని, ఇటువంటి బీజేపీకి ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీ దేశంలోని అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసిందని అన్నారు. అవినీతి పరులను దగ్గరపెట్టుకున్నారని, బీజేపీ ఏపీపై చేస్తోన్న కుట్రల్లో భాగస్వామ్యమవుతోన్న వారికి 2019లో ఓటు వేస్తారా? అని అడిగారు. లోక్ సభ ఎన్నికల్లో 25 సీట్లకి 25 మనమే గెలుచుకోవాలని, అప్పుడే ఏపీ కేంద్రం వద్ద పోరాడగలుగుతుందని చెప్పారు.

More Telugu News