జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైంది: ఎంపీ కేశినేని నాని

29-05-2018 Tue 14:36
  • మహానాడులో కేశినేని ప్రసంగం
  • అప్పట్లో మోదీ రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం చేశారు
  • ఇప్పుడు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు
  • 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేస్తే రాష్ట్రానికి నష్టం

జాతీయ రాజకీయాల్లో ఏపీ ముఖ్యమంత్రి, తమ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించాల్సిన సమయం ఇక ఆసన్నమైందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈరోజు విజయవాడలో జరుగుతోన్న తెలుగుదేశం మహానాడులో ఆయన మాట్లాడుతూ... గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాల హక్కుల కోసం మోదీ పోరాటం చేశారని, ఇప్పుడు రాష్ట్రాల హక్కులను కాలరాసేలా ఆయన సర్కారు వ్యవహరిస్తోందని అన్నారు.

రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తోందని, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేస్తే రాష్ట్రానికి రూ.7 వేల కోట్లు నష్టం వస్తుందని కేశినేని తెలిపారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందేలా కేంద్ర సర్కారు సహకరించాలని పేర్కొన్నారు.