nithin: మానవ సంబంధాల గొప్పతనాన్ని చాటే 'శ్రీనివాస కల్యాణం'

  • దిల్ రాజు నిర్మాతగా 'శ్రీనివాస కల్యాణం'
  • నితిన్ సరసన రాశి ఖన్నా
  • కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్  

దిల్ రాజు నిర్మాతగా .. సతీశ్ వేగేశ్న దర్శకుడిగా 'శ్రీనివాస కల్యాణం' రూపొందుతోంది. నితిన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన జోడీగా రాశి ఖన్నా కనిపించనుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్పవని చాటి చెప్పడమే ప్రధానంగా ఈ సినిమా కొనసాగుతుందట. ఆర్థికపరమైన సంబంధాలకే ఎక్కువగా విలువనిచ్చే ప్రకాశ్ రాజ్, ఒక తెలుగింటి పెళ్లికి అతిథిగా వస్తాడట. అనుబంధాలు .. ఆత్మీయతలు .. మానవ సంబంధాల్లోని గొప్పతనం ఆయనకి అక్కడే అర్థమవుతాయి. ఆయనకి కనువిప్పు కలిగించడమే ధ్యేయంగా ఈ కథ నడుస్తుందట. నిర్మాతగా దిల్ రాజు అప్పుడప్పుడు మానవ సంబంధాలను టచ్ చేసే కథాంశాలను అందిస్తూనే వస్తున్నారు. ఆ తరహా సినిమాలు ఆయనకి మంచిపేరు తెచ్చిపెట్టాయి కూడా. ఈ సినిమా కూడా అదే దారిలో వెళుతుందేమో చూడాలి.    

More Telugu News