గ్లామర్ డ్రెస్ తో హినా ఖాన్ డ్యాన్స్... వెకిలి చేష్టలేంటంటూ నెటిజన్ల ట్రాల్!

29-05-2018 Tue 12:53
  • బిగ్ బాస్ సీజన్ 11 రన్నరప్ హినా ఖాన్
  • 'లెట్స్ డ్యాన్స్' అంటూ వీడియో
  • రంజాన్ నెలలో ఈ పనులేంటని విమర్శలు

బిగ్ బాస్ సీజన్ 11లో రన్నరప్ గా నిలిచి దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న హినా ఖాన్, గ్లామర్ ఉట్టిపడేలా ఓ డ్రెస్ వేసుకుని, డ్యాన్స్ చేస్తూ, 'లెట్స్ డ్యాన్స్' అన్న కామెంట్ తో ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి విమర్శలు కొని తెచ్చుకుంది.

పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ వెకిలి చేష్టలు ఏంటంటూ నెటిజన్లు ట్రాల్ చేయడం మొదలు పెట్టారు. ఆమె చాలా చీప్ డ్రెస్ వేసుకుందని, మతపరమైన విశ్వాసాలు ఆమెకు లేవని విమర్శిస్తున్నారు. హినా ఖాన్ తాజా డ్యాన్స్ వీడియోను మీరూ చూడవచ్చు.


❤️

A post shared by Hina Khan (@realhinakhan) on