kodel sivaprasad: స్వయంగా వచ్చి హాజరుకండి: ఏపీ స్పీకర్ కు కరీంనగర్ కోర్టు ఆదేశం

  • ఎన్నికల్లో రూ. 11.50 కోట్లు ఖర్చు చేశానని గతంలో చెప్పిన కోడెల
  • కోర్టులో కేసు వేసిన కరీంగర్ వాస్తవ్యుడు
  • జూన్ 18న హాజరుకావాలంటూ కోర్టు ఆదేశం

కరీంనగర్ కోర్టులో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు చుక్కెదురైంది. జూన్ 18న స్వయంగా వచ్చి కేసు విచారణకు హాజరుకావాలని స్పెషల్ మొబైల్ కోర్టు కోడెలను ఆదేశించింది. 2014 ఎన్నికల్లో తాను రూ. 11.50 కోట్లు ఖర్చు చేశానని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో గతంలో కోడెల చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించిన కోడెలను అనర్హుడిగా ప్రకటించాలని కరీంనగర్ కు చెందిన సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో కోడెలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 2017 మార్చి 7న కోడెలకు కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో, హైకోర్టును ఆశ్రయించిన కోడెల వ్యక్తిగతంగా తాను కోర్టుకు హాజరుకాలేనని స్టే తెచ్చుకున్నారు. ఈ స్టే ఆర్డర్ ను సవాల్ చేస్తూ, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం భాస్కర్ రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. వాదోపవాదాలను విన్న తర్వాత... జూన్ 18న కోడెల స్వయంగా కరీంనగర్ కోర్టుకు హాజరుకావాలని జడ్జి రాజు ఆదేశించారు.  

More Telugu News