prabhas: 'సాహో' కథ ఏమిటని అడగలేదు .. ఎందుకంటే ప్రభాస్ ఉన్నాడనే!: మలయాళ నటుడు లాల్

  • నేను ఎంతగానో అభిమానించే హీరో ప్రభాస్ 
  • ఆయనపై నాకు ఎంతో నమ్మకం వుంది 
  • అందువల్లనే నేను ఏమీ అడగలేదు    

యూవీ క్రియేషన్స్ బ్యానర్లో .. భారీ బడ్జెట్ తో 'సాహో' సినిమా రూపొందుతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, రీసెంట్ గా 'అబుదాబి' షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ఆరంభించనున్నారు. ఈ సినిమాలో మలయాళ నటుడు లాల్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. 'అబుదాబి షెడ్యూల్లో ఆయన కూడా పాల్గొన్నారు.

తాజాగా ఆయన మాట్లాడుతూ .. " 'సాహో' సినిమా కోసం నన్ను సంప్రదించినప్పుడు నేను కథ ఏమిటని అడగలేదు .. అలాగే నా పాత్ర ఏమిటని అడగలేదు .. ఎందుకంటే నేనెంతో అభిమానించే ప్రభాస్ ఈ సినిమాలో హీరో. ఆయన ఈ సినిమాలో హీరో అని చెప్పగానే నేను రెండవ ఆలోచన చేయలేదు .. వెంటనే ఒప్పేసుకున్నాను. అందుకు కారణం ప్రభాస్ పై నాకు గల అభిమానం .. నమ్మకం. ఇక ఈ సినిమా కథ గురించి యూనిట్ లోనే ఎవరికీ పూర్తిగా తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే నా పాత్రను గురించి నేను కూడా చెప్పలేకపోతున్నాను" అంటూ ప్రభాస్ తో కలిసి దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

More Telugu News