lenovo z5: లెనోవో జెడ్ 5... ముహూర్తం జూన్ 5... 4టీబీ స్టోరేజీ ఫోన్... అదిరే ఫీచర్లు

  • ఫోన్లో పూర్తి స్క్రీన్
  • 6 జీబీ లేదా 8 జీబీ ర్యామ్
  • క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్

లెనోవో జెడ్ 5 విడుదల ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 5న బీజింగ్ లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫోన్ ను ఆవిష్కరించనున్నట్టు లెనోవో తెలిపింది. ఈ ఫోన్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్తి స్క్రీన్ తో ఉండే మొదటి ఫోన్ ఇది. 4టీబీ స్టోరేజీతో, 6జీబీ లేదా 8జీబీ ర్యామ్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ తో వస్తుందని సమాచారం.

కెమెరాలకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించింది. 45 రోజుల స్టాండ్ బై టైమ్ తో వస్తోంది. లెనోవో వైస్ ప్రెసిడెంట్ చాంగ్ చెంగ్ జెడ్ 5 గురించి ఇటీవల ఓ ఫొటోను విడుదల చేయడం గమనార్హం. అయితే, ఫోన్లో కొద్ది భాగాన్నే ఆ ఫొటో చూపిస్తోంది. అప్పటి నుంచి ఈ ఫోన్ లో ఉండే ఫీచర్లపై ఎంతో ఆసక్తి నెలకొంది. జూన్ 5న అసలు ఫీచర్లు, పూర్తి వివరాలు తెలియనున్నాయి.

More Telugu News