Karnataka: కర్ణాటకలో కీలక స్థానమైన ఆర్ ఆర్ నగర్లో నేడు పోలింగ్... గెలిచేది ఎవరు?

  • ఇటీవలి ఎన్నికల్లో ఆర్ ఆర్ నగర్ పోలింగ్ వాయిదా
  • ఓటర్ ఐడెంటిటీ కార్డులు ఓ ఫ్లాట్ లో భారీగా బయటపడడమే కారణం
  • దీంతో ఆ నియోజకవర్గానికి ఈ రోజు ఎన్నిక

కర్ణాటక రాష్ట్రంలో నేడు ఆసక్తిదాయకమైన ఎన్నిక జరుగుతోంది. రాజరాజేశ్వరి నగర్ శాసనసభ స్థానానికి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ పోలింగ్ నిర్వహిస్తోంది. ఉదయం 9 గంటల వరకు 11 శాతం పోలింగ్ నమోదైంది. ఇటీవల ఎన్నికల సమయంలో ఈ స్థానానికి పోలింగ్ ను వాయిదా వేశారు. ఈ నియోజకవర్గంలోని ఓ ఫ్లాట్ లో 10,000 ఓటర్ ఐడెంటిటీ కార్డులు మే 8న బయటపడడం వాయిదా వేయడానికి కారణం. అనంతరం ఇక్కడ ఎన్నికకు మే 28వ తేదీని ముహూర్తంగా ఈసీ నిర్ణయించింది.

దీంతో ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 221 స్థానాలకు గాను బీజేపీ 104 గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం విదితమే. అయితే, జేడీఎస్-కాంగ్రెస్ రెండూ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రజల తీర్పును అవహేళన చేశారని బీజేపీ విమర్శలు కూడా చేసింది. అయితే, ఇక్కడ విచిత్రంగా కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ జరుగుతోంది.    

More Telugu News