amit shah: యూసీలు అడిగే హక్కు అమిత్ షాకు ఎక్కడిది?: మహానాడులో చంద్రబాబు ఫైర్

  • పాలన వ్యవహారాల్లో అమిత్ షా తలదూర్చడం మంచిది కాదు
  • యూసీలను అడగాలంటే ప్రధానమంత్రే అడగాలి
  • వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు

ఏపీకి నిధులు ఇవ్వకుండా బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. జరిగిన పనులకు యూసీలు అడిగే హక్కు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఎక్కడిదని ఆయన మండిపడ్డారు. యూసీల గురించి అడగాలనుకుంటే ప్రధానమంత్రి అడగాలని అన్నారు. పాలనా వ్యవహారాల్లోకి బీజేపీ అధ్యక్షుడు తలదూర్చడం సరికాదని, సొంత పార్టీ వ్యవహారాల వరకే ఆయన పరిమితమైతే మంచిదని చెప్పారు.

ఇరు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజల సొమ్మును గుజరాత్ కు తరలిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంపై ఎంత ఎదురుదాడి చేసినా... వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. బెదిరింపు రాజకీయాలు, దుర్మార్గపు ఆలోచనలు చేయడం మంచిది కాదని అన్నారు. అమరావతికి సంబంధించి ఇప్పటికే రూ. 24 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని చెప్పారు. త్వరలోనే కొన్ని పనులు పూర్తవుతాయని తెలిపారు. తమ యూసీలు సరైనవే అని నీతిఅయోగ్ కూడా చెప్పిందని అన్నారు.

More Telugu News