Balakrishna: ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ముగించాలో నాకు తెలుసు: బాలకృష్ణ

  • తెలుగువాడు గర్వపడేలా 'ఎన్టీఆర్'
  • ఆయన జీవితం తెరచిన పుస్తకమే
  • కొన్ని తెలియని విషయాలనూ సినిమాలో ప్రస్తావిస్తాం

ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తాను స్వీయ సారథ్యంలో ప్రారంభించిన బయోపిక్ ను ప్రతి తెలుగువాడూ గర్వపడేలా తీస్తానని నటుడు బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మహానాడు వేదిక వద్ద మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెరచిన పుస్తకమేనని వ్యాఖ్యానించిన బాలయ్య, సినిమాను ఎక్కడ నుంచి ప్రారంభించాలో, ఎక్కడ ముగించాలో తనకు బాగా తెలుసునని అన్నారు.

ఈ సినిమాకు దర్శకత్వం వహించేందుకు క్రిష్ అంగీకారం తెలియజేయడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ఈ సినిమా ట్రైలర్ కు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని తెలిపారు. ఈ సినిమా ఎన్టీఆర్ గురించి అభిమానులకు తెలియని కొన్ని విషయాలను కూడా ప్రస్తావిస్తుందని బాలయ్య వెల్లడించారు.

More Telugu News