shamili: చిరంజీవి గారు నన్ను చూసి ఆశ్చర్యపోయారు: హీరోయిన్ షామిలి

  • చాలాకాలం తరువాత చిరంజీవి గారిని కలిశాను 
  • నేను ఎవరన్నది చెబుతూ పరిచయం చేసుకున్నాను 
  • ఆయన చాలా మురిసిపోయారు

బాలనటిగా ఒకప్పుడు ప్రేక్షకుల మనసులను దోచుకున్న బేబి షామిలి, ఆ తరువాత కొంతకాలానికి 'ఓయ్' అనే సినిమాతో కథానాయికగా పలకరించింది. ఆ సినిమా అంతగా ఆడకపోవడం .. ఆ తరువాత ఏదో కోర్స్ చేయాలని షామిలి విదేశాలకి వెళ్లిపోవడం జరిగింది. అక్కడి నుంచి తిరిగివచ్చిన తరువాత ఒక్కొక్కటిగా తమిళ సినిమాలను ఒప్పుకుంటోన్న షామిలి, తెలుగు సినిమాలపై కూడా దృష్టి పెట్టింది.

తాజాగా ఆమె చేసిన 'అమ్మమ్మగారిల్లు' ప్రస్తుతం థియేటర్లలో వుంది. ఈ నేపథ్యంలో షామిలి మాట్లాడుతూ .. "జగదేకవీరుడు అతిలోక సుందరిలో బాలనటిగా చేస్తున్నప్పుడు, షూటింగు సమయంలో శ్రీదేవి గారు .. చిరంజీవి గారు నన్నెంతో ముద్దు చేసేవారు. ఈ మధ్య ఓ సినిమా ఫంక్షన్ లో చిరంజీవిగారిని కలుసుకుని పరిచయం చేసుకున్నాను. నేను ఒకప్పటి బేబి షామిలిని అని చెబితే చిరంజీవిగారు ఆశ్చర్యపోయారు 'అంత చిన్న పిల్ల అప్పుడే ఇంత పెద్దదైపోయిందా?' అంటూ ఆయన మురిసిపోవడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. 

More Telugu News