ntr: రాజమౌళి సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చరణ్?

  • రాజమౌళి నుంచి మల్టీ స్టారర్
  • అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • ఎన్టీఆర్ పాత్రపై పెరుగుతోన్న ఆత్రుత  

ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి ఒక మల్టీ స్టారర్ ను రూపొందిస్తున్నారనే సంగతి తెలిసిందే. అక్టోబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో కొనసాగనుందనే ప్రచారం కొన్ని రోజులక్రితం వరకూ జోరుగా కొనసాగుతూ వచ్చింది. అయితే ఆ వార్తలో ఎంతమాత్రం నిజం లేదని చరణ్ స్పష్టం చేశాడు.

ఆయన ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. గతంలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన 'తూఫాన్ ' పరాజయంపాలు కాగా, 'ధ్రువ' చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. మూడవసారి ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా అభిమానులను అలరించనున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పాత్ర ఏమై ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఎన్టీఆర్ .. చరణ్ జోడీలుగా ఎవరు కనిపించనున్నారనేది కూడా అభిమానుల్లో ఆత్రుతను పెంచుతోంది.  

More Telugu News