Telangana: కొత్త జోనల్ విధానాన్ని ఆమోదించిన తెలంగాణ మంత్రివర్గం

  • ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం 
  • రైతు జీవిత బీమా పథకం, తదితర అంశాలకు లభించిన ఆమోదం
  • ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. కొత్త జోనల్ విధానం, రైతు జీవిత బీమా పథకంను మంత్రివర్గం ఆమోదించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో ఈరోజు మధ్యాహ్నం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మొత్తం15 అంశాలతో అజెండాను రూపొందించారు. రైతు సమన్వయ సమితి పోస్టుల మంజూరుకు, కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపునకు, దేవాదుల, తుపాకుల గూడెం ఆనకట్ట నిర్మాణానికి నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రి వర్గం ఓకే చెప్పింది. కాగా, సీఎం కేసీఆర్ ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. కొత్త జోనల్ విధానంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఓ నివేదిక సమర్పించనున్నారు.

More Telugu News