to: మా నాన్న నిజమైన కమ్యూనిస్టుగా బతికిన వ్యక్తి: మాదాల రంగారావు కుమారుడు రవి

  • ఎర్రజెండాను వెండి తెరపై ఎగరవేసిన మొట్టమొదటి విప్లవ హీరో  
  • యువతరం గుండెల్లో ఎర్రమల్లెలు పూయించారు
  • కేవలం సినిమాల్లోనే విప్లవవీరుల పాత్రను ఆయన పోషించలేదు
  • నిజ జీవితంలో కూడా ప్రజా ఉద్యమాలు చేశారు

కేవలం సినిమాల్లోనే కాకుండా, నిజజీవితంలో నిజమైన కమ్యూనిస్టుగా బతికిన వ్యక్తి తన తండ్రి మాదాల రంగారావు అని ఆయన కుమారుడు రవి అన్నారు. సినీ నటుడు మాదాల రంగారావు ఈరోజు మృతి చెందారు. ఈ సందర్భంగా మాదాల రవిని మీడియా పలకరించగా.. ‘ఎర్రజెండాను వెండి తెరపై ఎగరవేసిన మొట్టమొదటి అభ్యుదయ విప్లవ హీరో నా తండ్రి. యువతరాన్ని కదిలించి, వారి గుండెల్లో ఎర్రమల్లెలు పూయించి యావత్తు ప్రజాశక్తి చేత ఎర్రమల్లెలు పూయించిన విప్లవీరుడు ఆయన. కేవలం సినిమాల్లోనే విప్లవవీరుల పాత్రను ఆయన పోషించలేదు. నిజ జీవితంలో కూడా ప్రజా ఉద్యమాలు చేశారు. కమ్యూనిస్టు భావాలతో బతికిన ఆయన సినిమాల్లో వచ్చింది కూడా ప్రజలకే ఇచ్చి రియల్ కమ్యూనిస్టుగా బతికిన మహావ్యక్తి’ అని చెప్పుకొచ్చారు.

కాగా, సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ, ఒక చేతిలో ఎర్ర జెండా, మరో చేతిలో కళామతల్లికి సేవ చేస్తూ మాదాల రంగారావు తన జీవితం గడిపారని అన్నారు. కమ్యూనిస్టులు ఐక్యంగా ఉండాలని మాదాల రంగారావు ఎప్పుడూ కోరుకునేవారిని, ఆ ఐక్యత కోసం ఆయన చాలా సినిమాలు తీశారని ప్రశంసించారు.

More Telugu News