expressway: మౌలిక సదుపాయాల విషయంలో కులం, ప్రాంతం వారీ వివక్ష తగదు: ప్రధాని మోదీ

  • మా హయాంలో ఎన్నో మౌలిక ప్రాజెక్టులు
  • భారత్ లో తయారీ కార్యక్రమంతో భారీగా ఏర్పడిన మొబైల్ కంపెనీలు
  • భాగ్ పట్ ర్యాలీలో ప్రధాని ప్రసంగం
  • రెండు ఎక్స్ ప్రెస్ వేల ప్రారంభం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు రెండు ఎక్స్ ప్రెస్ వేలను ప్రారంభించారు. 9 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వే మొదటి దశను, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించారు. భాగ్ పట్ లో ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం అనంతరం భారీగా హాజరైన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి వివరించారు.

కులం, మతం, ప్రాంతం, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా మౌలిక సదుపాయాల్లో తారతమ్యం చూపరాదన్నారు. నాలుగేళ్ల క్రితం దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు 2 ఉంటే, భారత్ లో తయారీ కార్యక్రమం కారణంగా వాటి సంఖ్య 120కు పెరిగిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని ప్రారంభించిన ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వేను రూ.11,000 కోట్లతో 500 రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. ఎక్కడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండకుండా నిర్మించారు. ఇక 9 కిలోమీటర్ల ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వే దేశంలో 14 లేన్లతో ఉన్న తొలి హైవే. దీన్ని 18 నెలల్లో పూర్తి చేశారు.

More Telugu News