apcc: ఏపీీసీసీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉమెన్ చాందీ నియామకంపై హర్షం

  • కేరళలో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించిన నేత
  • అపార అనుభవం ఉన్న చాందీని ఏపీకి నియమించడం సంతోషం
  • రాహుల్ గాంధీకి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాం

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) వ్యవహారాల ఇన్ చార్జిగా కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు ఉమెన్ చాందీని నియమించడంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీసీసీ ఓ ప్రకటన చేసింది. కేరళలో దశాబ్దాల తరబడి పార్టీని విజయపథంలో నడిపించిన నేతగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన అపార అనుభవం ఆయనకు ఉందని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ పేర్కొన్నారు.

అపార అనుభవం ఉన్న చాందీని ఏపీకి నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ చర్య ఎంతగానో దోహదపడుతుందని, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై మంచి అవగాహన కలిగిన ఉమెన్ చాందీ, పార్టీని ఏకతాటిపై నడిపించి పునర్ వైభవం తీసుకువస్తారని ఆకాంక్షించారు.

More Telugu News