petrol diesel prices: కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ మంటలు... హైదరాబాద్ లో రూ.82.76కు పెట్రోల్

  • డీజిల్ ధర లీటర్ రూ.75.07
  • ముంబైలో పెట్రోల్ అత్యధికంగా రూ.85.93
  • లీటర్ పెట్రోల్ పై కేంద్రానికి సుంకం రూపంలో రూ.19.48
  • డీజిల్ పై రూ.15.33 చొప్పున ఆదాయం

అంతర్జాతీయంగా క్రూడాయిల్ కాస్త చల్లబడినా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా భగ్గుమంటూనే ఉన్నాయి. ఆదివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరల్ని చమురు సంస్థలు పెంచేశాయి. దీంతో హైదరాబాద్ మార్కెట్లో పెట్రోల్ లీటర్ ధర రూ.82.76కు చేరింది. డీజిల్ లీటర్ ధర రూ.75.07కు పెరిగింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర అత్యధికంగా 85.93కు చేరుకుంది. ఇది ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో రూ.78.12గా ఉంది. కోల్ కతాలో రూ.80.76, చెన్నైలో రూ.81.11కు చేరింది. ఈ విధంగా పెరిగే ధరలతో కరెంటు ఖాతా లోటు భారీగా పెరిగిపోతుందన్న ఆందోళన ఆర్థిక వేత్తల నుంచి వినిపిస్తోంది. పెరిగే ధరలు రూపాయి విలువను సైతం హరించేస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రం ఎక్సైజ్ సుంకం రూపంలో లీటర్ పెట్రోల్ పై రూ.19.48, డీజిల్ పై రూ.15.33 చొప్పున లబ్ధి పొందుతోంది. ఇక రాష్ట్రాల్లో వ్యాట్ బాదుడు కూడా ధరల్లో కలిసి ఉంటోంది.

More Telugu News