demonetisation: చిన్నోళ్ల దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తారు...పెద్దోళ్ల దగ్గర ఎందుకు చేయలేరు?: బ్యాంకుల తీరుపై నితీష్ కుమార్

  • డీమోనిటైజేషన్ ను బ్యాంకులు సరిగ్గా అమలు చేయలేదు
  • దీని తాలుకూ ప్రయోజనాలు ప్రజలకు అందలేదు
  • ప్రజల డిపాజిట్లు ఎగవేతదారుల పరం చేశారు
  • అసంతృప్తి వ్యక్తం చేసిన నితీష్ కుమార్

డీమోనిటైజేషన్ ను బ్యాంకులు సరిగా అమలు చేయలేకపోయాయని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. దీని తాలుకూ ప్రయోజనాలను ప్రజలు పొందలేకపోయారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన పలు విషయాలపై మాట్లాడారు. పీఎన్ బీ ఇతర బ్యాంకుల్లో ఇటీవల వేలాది కోట్ల రూపాయల స్కామ్ లు వెలుగు చూడడాన్ని ప్రస్తావించారు. భారీ రుణ ఎగవేతదారులు పెద్ద మొత్తంలో రుణాలు సంపాదిస్తూ దేశం దాటిపోతున్నారని పేర్కొన్నారు. పేదలు మాత్రం కఠిన వసూలు చర్యల్ని ఎదుర్కొంటున్నారని బ్యాంకుల తీరుపై విమర్శలు చేశారు.

‘‘చిన్న స్థాయి రుణ గ్రహీతల నుంచి రుణ వసూళ్లకు బ్యాంకులు కఠినంగా ఉంటాయి. భారీ రుణ ఎగవేతదారులపై బ్యాంకులు ఎందుకు అంత కఠినంగా ఉండవు?’’ అని నితీష్ కుమార్ ప్రశ్నించారు. డీమోనిటైజేషన్ కు తాను మద్దతు పలికానని, బ్యాంకులు పోషించిన పాత్రతో ప్రజలు అంత ప్రయోజనం పొందలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే ఆ డబ్బుల్ని తరలించుకుపోయారని (ఎగవేతదారులు) పేర్కొన్నారు.

More Telugu News