taxi driver: ట్యాక్సీ డ్రైవర్ ను పెళ్లాడిన ముంబై మోడల్... కారణం ఏమిటంటే..!

  • క్యాసినోలో ట్యాక్సీ డ్రైవర్ కు రూ.9 కోట్ల జాక్ పాట్
  • అది తెలిసి పెళ్లి చేసుకుంటానంటూ ముందుకొచ్చిన మోడల్ మిరాఖాత్రి
  • వెతకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టుగా మారిన డ్రైవర్ కథ

విహాన్ పటేల్ ఓ ట్యాక్సీ డ్రైవర్. జీవనోపాధి కోసం స్టీరింగ్ పట్టాడు. ఎత్తు 5.6. నల్లగా ఉంటాడు. అందగాడు కూడా కాదు. అయినా ఓ అందాలరాశి, ముంబై మోడల్ అతడ్ని పెళ్లాడింది. ఆ వివరాల్లోకి వెళితే..  

విహాన్ పటేల్ (27) ముంబైకి చెందిన బ్రహ్మచారి. జీవనోపాధి కోసం ట్యాక్సీ డ్రైవర్ గా మారాడు. తల్లిదండ్రులు అతడ్ని పెళ్లి చేసుకోరా బాబూ అంటూ రోజూ పోరుపెట్టినా ఫలితం లేదు. అతడ్ని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఉన్నట్టుండి ఓ రోజు కాలం అతడ్ని హీరోను చేసేసింది. గ్రాండ్ మోండియల్ క్యాసినోలో అతడు ఆడిన ఆట 9,43,49,014 రూపాయల ప్రైజ్ కు విజేతను చేసింది.

అంతే.. మరుసటి రోజే అతడి బ్యాంకు ఖాతాలో ఆ మొత్తం జమ అయింది. ఈ విషయం మీడియా కథనాల ద్వారా ముంబైకి చెందిన 23 ఏళ్ల మిరా ఖాత్రి అనే మోడల్ చెవిన పడింది. అదృష్టవంతుడ్ని పెళ్లాడాలని నిర్ణయించుకున్న ఆమె విహాన్ ఇంటి ముందు వాలిపోయింది. అంద అందగత్తె వచ్చి పెళ్లి చేసుకుంటానంటే ఎవరైనా కాదనుకుంటారా...? విహాన్, అతని తల్లిదండ్రులు ఓకే చెప్పడం, వారి పెళ్లి జరిగిపోవడం అయిపోయింది.

ఓ ట్యాక్సీ డ్రైవర్ ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అని తాను అనుకునేవాడినని విహాన్ తెలిపాడు. ఒకవేళ మిరాఖాత్రి డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకున్నా ఫర్వాలేదని, తాను మాత్రం జీవించి ఉన్నంత వరకు ఆమెను ప్రేమిస్తూనే ఉంటానన్నాడు. ‘ధనం మూలం ఇదం జగత్’ అని పెద్దలు ఊరకనే అనలేదు మరి!.

More Telugu News