Vijayawada: వింటేనే నోరూరిపోతోంది... మహానాడు మెనూ ఏమిటంటే...!

  • నేటి నుంచి మూడు రోజుల పాటు మహానాడు
  • విజయవాడ వేదికగా సాగనున్న పసుపు పండుగ
  • 20కి పైగా వంటకాలు సిద్ధం

నేటి నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో జరగనున్న తెలుగుదేశం 'మహానాడు'లో అతిథులకు, కార్యకర్తలకు వండి వడ్డించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎక్కడా లోపం కలుగకుండా, ఎవరికి నచ్చిన వంటకాలు వారు తృప్తిగా తినేలా ఏర్పాట్లు జరిగాయి. మూడు రోజుల్లో మొత్తం లక్షన్నర మంది జిహ్వ చాపల్యాన్ని 20కి పైగా వంటకాలు తీర్చనున్నాయి.

ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా, బందరు లడ్డూ, పూర్ణాలు, పప్పు, దప్పళం, ఉలవచారు, చక్కెర పొంగలి వంటి సంప్రదాయ వంటకాలతో పాటు యాపిల్ హల్వా, వెజ్ జైపూరీ, కడాయి వెజిటబుల్ కుర్మా, పులిహోర, వెజిటబుల్ బిర్యానీ, మునక్కాయ సాంబారు, గుత్తి వంకాయ మసాలా, బంగాళాదుంపల వేపుడు.. ఇలా చెబితేనే నోరూరిపోయే వంటకాలను తెలుగుదేశం పార్టీ నేతలు సిద్ధం చేయించారు. ఇక మహానాడులో పాల్గొనే వారికి అన్ని వేళలా మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు అందుబాటులో ఉంచినట్టు టీడీపీ నేతలు తెలిపారు.

More Telugu News