Donald Trump: ఎవ్వరూ ఊహించలేదు... ఉత్తర కొరియాలో అడుగుపెట్టిన దక్షిణ కొరియా అధినేత మూన్ జే ఇన్!

  • కిమ్, ట్రంప్ మధ్య చర్చల కోసం ద.కొరియా ప్రయత్నాలు
  • అకస్మాత్తుగా సరిహద్దు దాటిన మూన్ జే ఇన్
  • కిమ్ తో చర్చలు జరిపిని మూన్

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జూన్ 12న జరగాల్సిన చర్చల వ్యవహారం గంటకో మలుపు తిరుగుతున్న వేళ, ఎవ్వరూ ఊహించని విధంగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ శనివారం నాడు అకస్మాత్తుగా ఉత్తర కొరియాకు వెళ్లి కిమ్‌ జాంగ్‌ కు సర్‌ ప్రైజ్‌ ఇచ్చారు.

కిమ్, ట్రంప్ మధ్య చర్చలు ఎలాగైనా జరగాలన్న ఉద్దేశంతో ఇండియా చేసిన ప్రయత్నాలు కూడా విఫలమైన నేపథ్యంలో, ఉత్తర, దక్షిణ కొరియా సరిహద్దుల్లో ఉన్న పన్ముంజోమ్‌ కు వెళ్లిన మూన్ జే ఇన్, అక్కడే కిమ్ ను కలిసి, దాదాపు రెండు గంటలపాటు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఈ చర్చలపై దక్షిణ కొరియా అధ్యక్షుడి అధికారిక భవనం బ్లూ హౌస్‌ మీడియాకు వివరాలు వెల్లడించింది.

ఉత్తర కొరియా, అమెరికాల మధ్య చర్చలకు కిమ్‌, మూన్‌ లు మాట్లాడుకున్నారని, భేషజాలకు పోకుండా అమెరికాతో చర్చించేందుకు రెడీగా ఉండాలని కిమ్‌ కు మూన్‌ సూచించారని వెల్లడించింది. కాగా, ట్రంప్‌ తో చర్చలకు కిమ్‌ ఒప్పుకున్నారా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. ఈ విషయమై ఆదివారం అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.

More Telugu News