Astronaut: చంద్రుడిపై నడిచిన నాలుగో వ్యక్తి అలన్ బీన్ ఇక లేరు!

  • తీవ్ర అనారోగ్యంతో రెండు వారాల క్రితం ఆసుపత్రికి
  • ప్రశాంతంగా కన్నుమూసినట్టు చెప్పిన కుటుంబ సభ్యులు
  • సంతాపం తెలిపిన నాసా

చంద్రుడిపై నడిచిన నాలుగో వ్యక్తిగా రికార్డు సృష్టించిన వ్యోమగామి అలన్ బీన్ (86) ఇక లేరు. రెండు వారాల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన హోస్టన్‌లోని ఓ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుజామున ప్రశాంతంగా కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 1969లో రెండోసారి చంద్రుడిపై ల్యాండైన అపోలో 12కి లూనార్ మాడ్యూల్ పైలట్‌గా బీన్ వ్యవహరించారు. బీన్ అంతరిక్షంలో మొత్తం 69 రోజులు గడపగా, అందులో 31 గంటలు చంద్రుడిపై ఉన్నారు.

బీన్ మృతికి నాసా సంతాపం తెలిపింది. వ్యోమగామి మైక్ మాసిమినో మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు కలిసిన వాళ్లలో బీన్ ఒక అసాధారణ వ్యక్తి అని కొనియాడారు. నాసా నుంచి బీన్ రిటైరయ్యాక తనకెంతో ఇష్టమైన పెయింటింగ్‌లు వేస్తూ శేష జీవితాన్ని గడిపారు.

More Telugu News