cheetah: చిరుత పులితో ఫైటింగ్‌ చేసి.. కూతురిని రక్షించుకున్న తల్లి!

  • తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఘటన
  • ఇంటి వెనక కట్టెలు సేకరిస్తోన్న ముత్తులక్ష్మి
  • కూతురిపై చిరుత దాడి

తన బిడ్డల క్షేమం కోసం తల్లి పడే ఆరాటం అంతా ఇంతా కాదు. పిల్లలకు ఏ చిన్న ఆపద వచ్చినా తల్లడిల్లిపోతుంది. అవసరమైతే వారి కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతుంది. ఇటువంటి ఘటనే తమిళనాడులోని కోయంబత్తూర్‌లో చోటు చేసుకుంది. తన ప్రాణాలను లెక్కచేయకుండా ఏకంగా చిరుతతో పోరాడి తన కూతురిని రక్షించుకుంది ఓ తల్లి.

తన కూతురు సత్యతో కలిసి తమ ఇంటి వెనక కట్టెలు సేకరిస్తోన్న ముత్తులక్ష్మి అనే మహిళకు ఓ చిరుత కనపడింది. అది ఒక్కసారిగా తన కూతురిపై దాడికి దిగడంతో ముత్తులక్ష్మి ఓ కట్టెతో దాడి చేస్తూ పోరాడింది. దీంతో ఆ చిన్నారిని వదిలిన చిరుత పులి అక్కడి నుంచి పారిపోయింది.

ఈ ఘటనలో ఆ చిన్నారి మెడపైన తీవ్ర గాయాలు కావడంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ ప్రాంతంలో చిరుతలు పదే పదే తిరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.                

More Telugu News