TTD: రమణ దీక్షితులు ఇప్పటికే ఏడేళ్ల పదవీవిరమణ పొడిగింపు పొందారు: బోండా ఉమామహేశ్వరరావు

  • టీటీడీలో పగడ్బందీ వ్యవస్థ ఉంటుంది
  • ఎటువంటి అవకతవకలు జరగడానికి ఆస్కారం లేదు
  • టీటీడీలో అంతా ఆగమశాస్త్రం ప్రకారమే జరుగుతోంది

టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు రాజేసిన వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. టీటీడీ పాలనా వ్యవహారాలు బాగోలేవని, అవినీతి ఉందని, గులాబీ వజ్రం పోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా, తిరుపతిలో టీడీపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రమణ దీక్షితుల ఆరోపణలపై మండిపడ్డారు.

రాజకీయ కారణాలతోనే రమణ దీక్షితులు అలా మాట్లాడుతున్నారని, టీటీడీలో పగడ్బందీ వ్యవస్థ ఉంటుందని, ఎటువంటి అవకతవకలు జరగడానికి ఆస్కారం లేదని చెప్పుకొచ్చారు. టీటీడీలో అంతా ఆగమశాస్త్రం ప్రకారమే జరుగుతోందని, మరోవైపు 72 ఏళ్ల రమణ దీక్షితులు ఇప్పటికే టీటీడీ సహకారంతో ఏడేళ్ల పదవీవిరమణ పొడిగింపు పొందారని బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.     

More Telugu News