nikisha patel: మా లవ్ అఫైర్ బ్రేకప్ కావడానికి కారణం సినిమాలే!: నికిషా పటేల్

  • సినిమాల్లోకి రాకముందు ఒక వ్యక్తిని ప్రేమించా.. పెళ్లి చేసుకోవాలనుకున్నాం
  • నేను సినిమాల్లోకి రావడం అతనికి ఇష్టం లేదు
  • ఇప్పుడు ప్రేమ, పెళ్లి ఆలోచనలు లేవు

తాను సినిమాల్లోకి రాకముందు తన ప్రేమ వ్యవహారం గురించి హీరోయిన్ నికిషా పటేల్ వెల్లడించింది. తాను, ఒక వ్యక్తి ప్రేమించుకున్నామని... పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నామని చెప్పింది. అయితే, తాను సినిమాల్లోకి రావాలని ఎప్పుడైతే నిర్ణయించుకున్నానో... అప్పుడే తమ లవ్ అఫైర్ బ్రేకప్ అయిందని తెలిపింది. అతనికి తాను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని... దీంతో, గుడ్ బై చెప్పేశాడని చెప్పింది. నీవు సినిమాల్లోకి వెళ్తే మన పెళ్లి జరగదని కచ్చితంగా చెప్పేశాడని తెలిపింది. అయితే, అప్పుడు తనకు పెళ్లి కన్నా సినిమాల్లోకి రావడమే ప్రధాన లక్ష్యంగా కనిపించిందని... అతనితో అదే విషయాన్ని చెప్పానని... దీంతో, ఇద్దరం ఫ్రెండ్లీగానే విడిపోయామని చెప్పింది.

అన్నీ తెలిసే తాను అతన్ని వదులుకున్నానని నికిషా తెలిపింది. సినిమాల్లో కూడా తాను పూర్తిగా సక్సెస్ కాలేకపోయానని... అయినా, తాను బాధ పడటం లేదని చెప్పింది. ఒక్క సినిమా హిట్ అయినా... తాను బిజీ అవుతాననే నమ్మకం తనకు ఉందని తెలిపింది. గతంలో ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించేదాన్నని... ఇప్పుడు అలాంటి ఆలోచనలు రావడం లేదని స్పష్టం చేసింది. పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తే, అప్పుడు తప్పకుండా చేసుకుంటానని తెలిపింది. 

More Telugu News