ntr: ఎన్టీఆర్ మూవీలో మళ్లీ కాజల్ ఐటమ్ సాంగ్

  • షూటింగు దశలో ఎన్టీఆర్ మూవీ 
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్  

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక మూవీ రూపొందుతోంది. రీసెంట్ గా ఈ సినిమాకి 'అరవింద సమేత వీర రాఘవ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఎన్టీఆర్ న్యూ లుక్ .. ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ .. కొంపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ ఒకటి ఉందట. ఆ సాంగ్ ను కాజల్ తో చేయించనున్నారనేది తాజా సమాచారం. గతంలో 'జనతా గ్యారేజ్' లో కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ ఏ స్థాయిలో అదరగొట్టిందో తెలిసిందే. అంతకి మించి ఈ సాంగ్ ఉంటుందని అంటున్నారు. దసరాకి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు.  

More Telugu News