Nagarjuna: నాగార్జున ఫ్యాన్స్ అందరికీ ఇదే నా ఆహ్వానం: దర్శకుడు వర్మ

  • ఈ నెల 28న ‘ఆఫీసర్’ ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నాం
  • ఎన్ కన్వెన్షన్ లో రాత్రి 7 గంటలకు నిర్వహిస్తాం
  • నాగార్జున ఫ్యాన్స్ అందరూ ఈ వేడుకలో పాల్గొనాలి
  • జూన్ 1న ‘ఆఫీసర్’ విడుదల

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆఫీసర్’. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకను ఈ నెల 28వ తేదీ రాత్రి ఏడు గంటలకు ఎన్ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నట్టు ఓ ట్వీట్ లో తెలిపారు. ‘నాగార్జున ఫ్యాన్స్ అందరికీ ఇదే నా ఆహ్వానం. దయచేసి ఈ వేడుకలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నా. ఈ చిత్రాన్ని జూన్ 1న విడుదల చేస్తున్నాం’ అని వర్మ చెప్పారు.

కాగా, ఈ చిత్రంలో నాగార్జున సరసన మైరా శరీన్ నటిస్తుండగా, నాగ్ కుమార్తెగా చిన్నారి కావ్య నటిస్తోంది. ఈ చిత్రంలోని ‘నవ్వే నువ్వు..’ అని సాగే పాట ఈ నెల 22న విడుదలైంది. ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్న ఈ పాటను మొత్తం 3.4 లక్షల మంది వీక్షించారు. 

More Telugu News