keerti suresh: 'మహానటి' రిజల్ట్ సావిత్రిగారి క్రేజ్ కి నిదర్శనం .. షాక్ అయ్యాను: విజయ్ దేవరకొండ

  • 'మహానటి'లో భాగం కావడం అదృష్టం 
  • ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు 
  • నిజంగా చాలా సంతోషంగా వుంది

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మహానటి' .. మూడవ వారంలోను వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ కి హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. "ఈ సినిమా చేయడానికి ముందు నాకు సావిత్రి గారి గురించి పెద్దగా తెలియదు. నా పాత్రను చేస్తున్నప్పుడే సావిత్రి గారి గురించి కొంచెం కొంచెంగా తెలిసింది" అన్నాడు.

"ఈ సినిమా ప్రివ్యూ చూసిన తరువాత .. సావిత్రి గారి లైఫ్ గురించి తెలిసి షాక్ అయ్యాను. నా పాత్ర .. సమంత పాత్ర గురించి తప్ప నాకు మిగిలిన విషయాలు తెలియదు. ఈ సినిమా చూసిన తరువాత .. ఇంత కష్టపడ్డారా? అనుకుంటూ ఆశ్చర్యపోయాను. 'మహానటి' లాంటి సినిమాలు మళ్లీమళ్లీ వచ్చేవి కావు. నేను ఎక్కడికి వెళ్లినా అంతా ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ రిజల్ట్ సావిత్రిగారి క్రేజ్ కి నిదర్శనం. ఇంతటి గొప్ప సినిమాలో ఒక భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా వుంది" అని చెప్పుకొచ్చాడు.   

More Telugu News